Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబుపై క్రిమినల్ కేసు హాస్యాస్పదం: అయ్యన్నపాత్రుడు

చంద్రబాబుపై క్రిమినల్ కేసు హాస్యాస్పదం: అయ్యన్నపాత్రుడు

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రకమైన ఎన్-440కే ఉనికిని కనుగొన్నట్లుగా సీసీఎంబీ నిర్ధారించిందని చెప్పారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని అయ్యన్న అన్నారు. పేద ప్రజల పక్షాన పోరాడాల్సిన న్యాయవాది.. వైసీపీ నేతలకు కొమ్ముకాయడం తగునా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy