Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్దలు

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్దలు

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. 39 ఏళ్ల పాటు ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు.

దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. చెపాక్ స్టేడియం వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ2026 ఫైనల్‌లో ఇషాన్ 350 పరుగులు చేశాడు. మరి.. ఇషాన్ సాధించిన ఈ సంచలన రికార్డుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...

దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారథ్యంలో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్‌కు చేరి.. సౌత్ జోన్‌తో తలపడుతోంది. ఈ పాకెట్ డైనమో అసాధరణ ప్రదర్శనతో ఈస్ట్ జోన్ జట్టు విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్(270), రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో చెలరేగి ఆడాడు. కేవలం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు.

ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌ మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 350 పరుగులు చేశాడు. తద్వారా 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కిషన్ అరుదైన రికార్డును సాధించాడు. గతంలో టీమిండియా మాజీ క్రికెటర్ రమణ్ లంబా చేసిన 320 పరుగులే అత్యధికంగా ఉండేది. 1987లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ తరపున లంబా ఈ ఘనత సాధించాడు. దాదాపు 39 ఏళ్ల తర్వాత తాజా నాక్‌తో లంబాను కిషన్‌ అధికమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

దులీప్ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..

  • ఇషాన్ కిషన్- 350 పరుగులు (270, 80)

  • రమణ్ లంబా- 320 పరుగులు (320, బ్యాటింగ్ చేయలేదు)

  • గగన్ ఖోడా- 300 పరుగులు (300, బ్యాటింగ్ చేయలేదు)

  • లాలాచంద్ రాజ్‌పుత్- 298 పరుగులు (23, 275)

strong>

ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత్ 'ఏ' ప్రకటన.. హార్దిక్ పాండ్యకు చోటు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy