అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలపై సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ఈరోజు (బుధవారం) ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.హై లెవల్ మీటింగ్‌కు డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌గా రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు హాజరయ్యారు. మొత్తం 12 వందలకు పైగా పోలీసు స్టేషన్ల నుంచి ఎస్‌హెచ్ఓలు సహా, వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్‌గా ఈ సమావేశంలో 1650 మంది అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ క్రైమ్, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల కట్టడిపై పోలీసులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఏపీవ్యాప్తంగా పోలీసు స్టేషన్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో ఎస్‌హెచ్ఓలు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వార్తలు కూడా చదవండి...

