Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేదెక్కిన చక్కెర

చేదెక్కిన చక్కెర

నెల కిందట కిలో చక్కెర 45-50 రూపాయల మధ్యన ఉండేది. వారం రోజులుగా నెమ్మదిగా ధర పెరుగుతూ ఇప్పుడు రూ.70కి చేరింది. అంటే కిలోకు రూ.25-30 ధర పెరిగింది.

బియ్యం కార్డుదారులున్న 4,81,056 మందికి అరకిలో వంతున రేషన్‌ షాపుల్లో నగదుకు చక్కెర పంపిణీ చేస్తున్నారు. మిగిలిన వారంతా మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే. ఒక్కో కుటుంబం నెలకు సుమారు రెండు కిలోల చక్కెర వినియోగిస్తున్నట్లు అంచనా. ఉదయం లేవగానే కాఫీ, టీ తాగని వారు అరుదు. ఇక, పిండివంటలకు చక్కెర తప్పనిసరి. మరోవైపు వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి వంటి ముఖ్య పండుగలు వస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు తగ్గడం, చెరకు సాగు క్రమేపీ కనుమరుగు కావడం కారణంగా చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. దీంతో పంచదారను పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకూ మహారాష్ట్ర నుంచి పంచదార దిగుమతి అయ్యేది. కొద్ది నెలలుగా ఇదీ ఆగిందని వ్యాపారులు చెబుతున్నారు. మరో పక్క ఇథనాల్‌ తయారీకి చెరకును మళ్లిస్తున్నారన్న సమాచారం ఉంది. ఇవన్నీ చక్కెర ధర పెరగడానికి కారణాలుగా తెలుస్తోంది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు పాత స్టాకును నిల్వ చేసుకుని కృత్రిమ డిమాండు పెంచి.. బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy