Dailyhunt
చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం

చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం

నకాపల్లి జిల్లా, ఏప్రిల్ 1: పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటించారు. ఈరోజు(బుధవారం) ఉదయం నక్కపల్లి చేరుకున్న మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు అనిత. నేతన్న జీవితాల్లో సరికొత్త వెలుగులంటూ కరపత్రాలు పంచుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా అందిస్తున్నామంటూ చేనేత కార్మికులకు తెలియజేశారు.

నక్కపల్లిలో చేనేత కార్మికులతో మాట్లాడిన హోంమంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికురాలితో కలిసి హోంమంత్రి అనిత మగ్గం నేశారు. ఆ కార్మికురాలి వద్ద చీరను కొనుగోలు చేశారు. కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించి చేనేత కార్మికులకు మెరుగైన ఆదాయం కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం బోదుగలం సమీపంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు.

.

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

Read Latest AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy