చెన్నై: మెట్రో ప్రయాణికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నాటికి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ) తీసుకురానున్నట్టు తెలిపింది.
2019లోనే గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎన్‌సీఎంసీని తీసుకురావాలని ఆలోచన చేసింది. షాపింగ్, బ్యాంకింగ్ సహా మెట్రో రైల్, ఎంటీసీ, ఇతర రవాణా వ్యవస్థల్లో నిరంతరాయంగా ప్రయాణించే ఉద్దేశంతో ఈ ఐడియాను తీసుకొచ్చింది. ఈ కార్డులను ఆన్‌లైన్ ద్వారా కానీ, మెట్రో స్టేషన్లలో కానీ రీచార్జ్ చేసుకోవచ్చు.

