Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చికాగోలో ప్రముఖ రచయిత వేలూరి వేంకటేశ్వరరావు సంస్మరణ సభ

చికాగోలో ప్రముఖ రచయిత వేలూరి వేంకటేశ్వరరావు సంస్మరణ సభ

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ తెలుగు రచయిత, సాహితీవేత్త వేలూరి వేంకటేశ్వరరావు సంస్మరణ సభ అమెరికాలోని చికాగోలో జరిగింది. శనివారం(మే 16) నేపర్‌విల్ నగరంలోని 195వ స్ట్రీట్ పబ్లిక్ లైబ్రరీలో స్థానిక సాహిత్యకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సభకు ప్రముఖ చిత్రకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్‌వీ.రామారావు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు తెలుగు కమ్యూనిటీ లీడర్, ఆటా మాజీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి.. వేలూరి వేంకటేశ్వరరావు చిత్రపటం ముందు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

అనంతరం సభాధ్యక్షుడు పద్మశ్రీ రామారావు.. వేలూరి వేంకటేశ్వరరావుతో తనకున్న దశాబ్దాల పరిచయాన్ని, ఆయన అందించిన ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నారు. వేలూరి వ్యక్తిత్వం తనపై ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. ఆయనకు కళల పట్ల ఉన్న మక్కువను గుర్తు చేసుకున్నారు. ఈ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని వేలూరి సాహితీ ప్రస్థానాన్ని కొనియాడారు. వక్తలు దామరాజు లక్ష్మి, కమల చిమట, మెట్టుపల్లి జయదేవ్, డాక్టర్ రవి రెడ్డి, ప్రకాశం తిమ్మాపురం, తాతా ప్రకాశం తదితరులు మాట్లాడుతూ.. వేలూరి రచనల్లోని చమత్కారాన్ని, విశేషాలను విశ్లేషించారు. 'ఈ మాట' అంతర్జాల పత్రిక ద్వారా ఆయన సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన రచనల్లో వ్యంగ్యం, హాస్య ధోరణితో పాటు సమాజం పట్ల ప్రేమ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తాయని కొనియాడారు. కాలిఫోర్నియా నుంచి గోరతి బ్రహ్మానందం, ఇండియానా పోలీస్ నుంచి భక్త ఆపూరి జూమ్ మీటింగ్ ద్వారా ఈ సభలో డిజిటల్‌గా పాల్గొని వేలూరితో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. చికాగోలో ఇంతటి మహనీయుడి సంస్మరణ సభను అద్భుతంగా నిర్వహించిన సాహితీ మిత్రులకు అందరూ అభినందనలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy