పాలకొండ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓని గ్రామానికి చెందిన వివాహిత సురవన అనిత(35) చికిత్సపొందుతూ మృతిచెందింది. పోలీసులు, తండ్రి దుర్గారావు కథనం మేరకు..
పాలకొండలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన పక్కి దుర్గారావు కుమార్తె అనితతో ఆరు సంవత్సరాల కిందట సురవన నరేష్‌తో వివాహం జరిగింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అనిత, ఆమె భర్త నరేష్ మధ్య చిన్న చిన్న కలహాలు జరుగుతుండేవి. సమస్యను వారే పరిష్కరించుకొనేవారు.
అయితే బుధవారం రాత్రి అనిత, ఆమె భర్త నరేష్ మధ్య గొడవ జరిగింది. మానసికంగా బాధపడిన అనిత ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం గమనించిన భర్త నరేష్ అనితను ఆటోలో చికిత్సనిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ విషయం ఆమె భర్త నరేష్ ఫోన్ ద్వారా అనిత తండ్రి దుర్గారావుకు తెలియజేశాడు.
భర్త వేధింపుల తోనే అనిత మానసికంగా బాధపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పోలీసు లకు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

