Dailyhunt

చిన్నారులందరికీ వైద్య పరీక్షలు తప్పనిసరి

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌ సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: చిన్నారుల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడం కోసం వారందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ అన్నారు.

బధిరుల అంతర్జాతీయ వారోత్సవాల (ఇంటర్నేషనల్‌ వీక్‌ ఆఫ్‌ డెఫ్‌ పీపుల్‌) సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో భారతీ పవార్‌ మాట్లాడారు. దేశంలో సుమారు 9 కోట్ల మంది ప్రజలు వినికిడి సమస్యలతో బాధపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. చిన్నప్పుడే ఇలాంటి సమస్యలను తెలుసుకోవాలంటే వైద్య పరీక్షలు చేయించాల్సిందేనని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy