Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్నగెడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు తనిఖీ

చిన్నగెడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు తనిఖీ

పరిమాణం చిన్నగా ఉన్న రెండు ట్రేలు తిరస్కరణ

చింతపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నగెడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో కాంట్రాక్టర్‌ సరఫరా చేసిన గుడ్లను ఐసీడీఎస్‌ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు.

పరిమాణం తక్కువగా ఉన్న రెండు ట్రేల గుడ్లను తిరస్కరించి వెనక్కి పంపించేశారు. సోమవారం చిన్నగెడ్డ అంగన్‌వాడీ కేంద్రానికి చిన్నపరిమాణం ఉన్న గుడ్లు సరఫరా చేసిన విషయమై 'చిన్నబోయిన గుడ్లు' శీర్షికన 'ఆంధ్రజ్యోతి'లో మంగళవారం కథనం ప్రచురితంకావడంతో కలెక్టర్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ స్పందించి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గౌరి చిన్నగెడ్డ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. స్థానిక గిరిజనుల ఎదుట గుడ్లు బరువు తూకం చేశారు. బరువు తక్కువగా ఉన్న రెండు ట్రేల గుడ్లు వెనక్కి పంపించి, పెద్ద పరిమాణం కలిగిన గుడ్లు అందజేశామని సూపర్‌వైజర్‌ గౌరి తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నపరిమాణం కలిగిన గుడ్లు కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తే వెంటనే తిరస్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆమె సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy