Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం

చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం

చిత్తూరు: జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. పాజిటీవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కళ్లముందే అయినవారిని కోల్పోతున్నారు. ఆస్పత్రికి వచ్చే కోవిడ్ బాధితులకు బెడ్లు లేక, ఆక్సిజన్ అందక.. ఆస్పత్రి ఆవరణ బయటే ప్రాణాలు వదులుతున్నారు. మదనపల్లి ఆస్పత్రిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిత్యం 10 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. కొండయ్యపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర అనే వృద్ధుడు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చాడు. అయితే కాసేపటికే భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. కళ్లముందే తన భర్త మృతి చెందడంతో ఆమె భోరున విలపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy