Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!

చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో అరుదైన రనౌట్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో న్యూఢిల్లీ టైగర్స్-ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిన పోరు తొలిసారి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

చివరికి ఔటర్ ఢిల్లీ వారియర్స్ ఉత్కంఠభరిత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ క్రేజీ రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూఢిల్లీ టైగర్స్ 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ 25 బంతుల్లో 61 పరుగులు, లక్షయ్ థరేజా అజేయంగా 62 పరుగులతో రాణించి జట్టుకు భారీ స్కోరు అందించారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఔటర్ ఢిల్లీ వారియర్స్ ఒక దశలో 80/5తో కష్టాల్లో పడింది. అయితే మోను శుక్లా కేవలం 17 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన సమయంలో మ్యాచ్ ఉత్కంఠకు చేరుకుంది.

ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరమైన వేళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మిడ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హిమ్మత్ సింగ్ బంతిని అందుకునే క్రమంలో మిస్‌ ఫీల్డ్ చేశాడు. బంతి అతడి కాలికి తాకి అనుకోకుండా నాన్‌స్ట్రైకర్ ఎండ్ స్టంప్స్‌ను తాకింది. అప్పటికే పరుగుకు ప్రయత్నించిన బ్యాటర్ క్రీజు దాటకపోవడంతో రనౌట్‌గా తేల్చారు. దీంతో ఖాయమైన విజయం చేజారగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

సూపర్ ఓవర్‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ 20 పరుగులు చేసింది. 21 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూఢిల్లీ టైగర్స్‌కు హిమ్మత్ సింగ్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. కానీ మరుసటి బంతికే అవుట్ అయ్యాడు. ఆ వెంటనే హృతిక్ షోకీన్ కూడా వికెట్ సమర్పించుకోవడంతో టైగర్స్ ఆలౌట్ అయ్యి, ఔటర్ ఢిల్లీ వారియర్స్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

strong>

వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్

జట్టును వీడిన కోచ్‌లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy