Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CM: నేడు, రేపు సీఎం కుప్పం పర్యటన

CM: నేడు, రేపు సీఎం కుప్పం పర్యటన

కుప్పం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో సీఎం చంద్రబాబు సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నారు. మొదటగా ఖరారైన పర్యటన షెడ్యూల్‌లో సోమవారం జలహారతి కార్యక్రమం ఉండగా..

తాజాగా మంగళవారానికి మార్చారు. మిగిలిన షెడ్యూల్‌ యథాతథంగా ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు అటూ ఇటూ మారాయి. సీఎం పర్యటించనున్న ప్రాంతాలను ఆదివారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌ డూడీ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కడా పీడీ వికా్‌సమర్మత్‌, సీఎం వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్‌, ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు తదితరులు పరిశీలించారు. రైతు బజార్‌ వద్ద ఏర్పాట్లను ఏఎంసీ చైర్మన్‌ జి.మునిరాజు చూశారు. జలహారతి ప్రాంతంతోపాటు బహిరంగ సభ నిర్వహించనున్న కుప్పం కొత్తపేటలోని ప్రాంతాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. రైల్వే స్టేషన్‌లో నూతనంగా స్టాపింగ్‌ ఇవ్వనున్న దాదర్‌ ఎక్స్‌ప్రె్‌సను జెండా ఊపి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికీ వెళ్లారు. శాంతిపురం మండలం తుమ్మిశి హెలిప్యాడ్‌.. కడపల్లె నివాసం సమీపంలో పార్టీ శ్రేణుల సమావేశ స్థలం వద్ద ఏర్పాట్లు చూశారు. ఆయా ప్రాంతాలలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టాలన్నారు. వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా, డివిజన్‌ అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఇలా..

తాజా షెడ్యూల్‌ ప్రకారం.. సోమవారం ఉదయం 10 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిశిలోని హెలిప్యాడ్‌కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. 10.30 గంటలకు కొత్తపేట చేరుకుని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. ఇక్కడే 11 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల దాకా బహిరంగ సభలో పాల్గొంటారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై ఏర్పాటు చేసే గ్యాలరీని 2 నుంచి 4 గంటలదాకా సందర్శిస్తారు.

సాయంత్రం 4-430 గంటల మధ్య బీసీఎన్‌ కూడలిలో బైపాస్‌ రోడ్డును ఆనుకుని రైతు బజారుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శాంతిపురం మండలం కడపల్లె వద్ద గల స్వగృహానికి చేరుకుంటారు.

రాత్రి .9.45 గంటలకు కుప్పం రేల్వే స్టేషన్‌ చేరుకుని 11 గంటలదాకా అక్కడే ఉండి, నూతనంగా కుప్పంలో స్టాపింగ్‌ ఇచ్చిన దాదర్‌- పాండిచ్చేరి ఎక్స్‌ప్రె్‌సను జెండా ఊపి ప్రారంభిస్తారు. తిరిగి 11.15 గంటలకు ఇంటికి చేరుకుంటారు.

రేపటి కార్యక్రమాలు

మంగళవారం మధ్యాహ్నం 12.10 గంటలకు శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లెలో కృష్ణా జలాలకు జలహారతి ఇస్తారు.

12.40 నుంచి 1.30 గంటల వరకు కడపల్లెలో స్వగృహం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఈసీ ఫౌలీ్ట్ర షెడ్‌ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటలదాకా పార్టీ శ్రేణులతో సమావేశమై తిరుగు ప్రయాణమవుతారు. 'కుప్పం'లోకి

'కుప్పం'లోకి కృష్ణా జలాలు

రామకుప్పం, ఆంధ్రజ్యోతి: కుప్పం నియోజకవర్గ ముఖ ద్వారమైన రామకుప్పం మండలంలోని వర్థికుప్పం వద్దకు ఆదివారం ఉదయం కృష్ణాజలాలు ప్రవేశించాయి. దీంతో నియోజకవర్గ రైతులు, జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజుపేట వద్ద హంద్రీ-నీవా కాలువ వద్ద మండల టీడీపీ నేతలు జలహరతి నిర్వహించి, కృష్ణాజలాలకు స్వాగతం పలికారు. రెండు రోజుల పాటూ నియోజకవర్గ పర్యటనకు వచ్చే సీఎం చంద్రబాబు మంగళవారం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీ-నీవా కాలువలో కృష్ణాజలాలకు జలహారతి ఇవ్వనున్నారు. రాత్రికి శాంతిపురం మండలం దాటి గుడుపల్లె మండలానికి చేరాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy