ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
డాక్టర్ రమేశ్ కస్టడీకి హైకోర్టు అనుమతి
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని స్వర్ణ ప్యాలె్‌సలో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేశ్‌బాబును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు రమేశ్‌బాబును ఆయన న్యాయవాది సమక్షంలో విచారించవచ్చని స్పష్టం చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ పోలీస్ అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో, కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతికదూరం పాటిస్తూ విచారించాలని ఆదేశించింది. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy