Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డబుల్ సెంచరీ మిస్ కావడంపై  గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

డబుల్ సెంచరీ మిస్ కావడంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు దుమ్మురేపింది. లఖ్‌నవూ వేదికగా నిన్న(బుధవారం) జరిగిన మ్యాచ్‌లో 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

దీంతో మూడో వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 154 పరుగులతో సత్తా చాటాడు. డబుల్ సెంచరీ మిస్ చేసుకోవడంపై టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. డబుల్ సెంచరీ మిస్ కావడం గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ అనంతరం శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ.. 'స్పష్టమైన ఆలోచనతో తొలి బంతి నుంచే బాదడం ప్రారంభించాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం వచ్చింది. ఈ సిరీస్‌లో నేను ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్‌లను ఫినిష్‌ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు కచ్చితంగా క్రీజులో ఉండాలని టార్గెట్‌ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా' అని గిల్ వెల్లడించాడు.

'నేను ద్విశతకం పూర్తి చేయాలనే అనుకున్నా. కాస్త నిదానంగా ఆడినా డబుల్ సెంచరీ మార్క్ అందుకునే వాడిని. కానీ జట్టు స్కోరు దాదాపు 450గా ఉంచాలంటే నేను హిట్టింగ్‌ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. అందుకే డబుల్ సెంచరీకి చేరువైనా హిట్టింగ్‌ను ఆపలేదు. ఈ పిచ్‌ మీద 330 లోపు మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించ దగ్గ టార్గెటే. మేము ముందు నుంచే వ్యూహాత్మకంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు' అని శుభ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు.

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy