Dailyhunt
దగ్గితే.. రెడ్‌కార్డ్‌

దగ్గితే.. రెడ్‌కార్డ్‌

జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌): ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటల నియమ నిబంధనల విషయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని కఠిన నిబంధలను కూడా ప్రవేశపెట్టారు. తాజాగా ఫుట్‌బాల్‌లో దగ్గినా రెడ్‌కార్డ్‌ చూపించనున్నారు. వైరస్‌ నేపథ్యంలో కొత్త నియమ నిబంధనలను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల బోర్డు (ఐఐఏబీ) రూపొందించింది. ఉద్దేశపూర్వకంగా ఓ ఆటగాడు దగ్గాడని భావిస్తే రెఫరీ రెడ్‌కార్డ్‌ చూపించే చాన్సుంది. ఒక్కోసారి ఎల్లో కార్డుతో సరిపెట్టవచ్చు. అనుకోకుండా లేదా ఆటగాళ్లకు దూరంగా ఉండి దగ్గితే ఎలాంటి చర్యలూ ఉండవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy