Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డల్లాస్‌లో 'అమానా' ఈద్ మిలాప్ వేడుకలు

డల్లాస్‌లో 'అమానా' ఈద్ మిలాప్ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(AMANA) టెక్సాస్ విభాగం ఆధ్వర్యంలో డల్లాస్ పరిసర ప్రాంతమైన ప్లేనోలో ఈద్ మిలాప్ వేడుకలు జరిగాయి.

అమానా టెక్సాస్ చాప్టర్ అధ్యక్షుడు మస్తాన్ షేక్, ఉపాధ్యక్షుడు అర్ఫీ సిద్దిఖీ నాయకత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఖురాన్ పారాయణతో వేడుకను ప్రారంభించారు. స్థానిక చిన్నారులు జోహా మొహమ్మద్, రెహాన్ షేక్ అనువాదం అందించారు. డాక్టర్ అంజుమ్ వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని నడిపించారు. 'అమానా' ఉత్తర అమెరికావ్యాప్తంగా 11 విభాగాలతో ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని నిర్వాహకులు వివరించారు. అమానా గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ ఖుద్దూస్ అమానా లక్ష్యాలు, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్‌లో అమానా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి ప్రసంగించారు.

బీఓడీ చైర్ డాక్టర్ అబ్దుల్ రహీమాన్ అమానా మార్గదర్శక సూత్రాల గురించి వివరించారు. ఇతర సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని, పరస్పర సంబంధాలను బలపరచాల్సిన ప్రాముఖ్యతను, ముస్లింలపై ఏర్పడుతున్న ప్రతికూల భావజాలాలను సానుకూలంగా ఎదుర్కోవాల్సిన బాధ్యతను ప్రస్తావించారు.

బీఓటీ చైర్ మొహమ్మద్ ఇక్బాల్ ఈద్ మిలాప్ సందేశాన్ని అందించారు. అనంతరం పలువురు స్థానిక ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు అవార్డులను ప్రదానం చేశారు. 100వ స్పెల్లింగ్ బీ చాంపియన్ ఫైజాన్ జాకీని సత్కరించారు. ఈ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి ముస్లిం బాలుడిగా అతను సాధించిన చారిత్రాత్మక విజయాన్ని కొనియాడారు. అబ్దుల్ హమీద్ సేవలకు గుర్తింపుగా Volunteer Excellence Awardతో సత్కరించారు.

IANT అధ్యక్షుడు మహేందర్ ఘనపురం, ఐఏఎన్‌టీ ప్రెసిడెంట్-ఎలెక్ట్ దీపక్ కల్రా, టీపీఏడీ నుండి వేణు భాగ్యనగరి, Rahbar Foundation నుండి అజహర్ పాషా, ESCO నుండి ఖుద్రతుల్లా అల్వీ, ఇషాక్ అహ్మద్, NASIM Foundation నుండి మజాహిర్ సయ్యద్, అహ్మద్ ఖాద్రీ, TANTEX నుండి మాధవి లోకిరెడ్డి, Radio Surabhi నుండి రాజేశ్వరి ఉదయగిరి, Radio Sangam నుండి పృథ్వి బల్లా, Dallas Area Rayalaseema Association నుండి వీరశివరెడ్డి, సిలికానాంధ్ర నుండి భాస్కర్ రాయవరం తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమ నిర్వహణలో మస్తాన్ షేక్, అర్ఫీ సిద్దిఖీ, జకీర్ షేక్, షాజహాన్ షేక్, సాబీర్ మహమ్మద్, రుమాన్ ఖాన్, అబ్దుల్ మజీద్, ఇంతియాజ్ అహ్మద్, జమీర్‌ ఉద్దీన్ మొహమ్మద్, ఖాజా షేక్, సలీమ్ జిలానీ, ఖాదర్ షేక్, కలీం సయ్యద్, యూనుస్ ఖాన్ తదితరులు సహకరించారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముస్లిం కుటుంబాల సామాజిక, సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ - అమానా. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం పలు సేవా కార్యక్రమాలకు అమానా నిర్వహిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy