Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దమ్ముంటే బాక్సింగ్ రింగ్‌లోకి రా'.. భజ్జీకి శ్రీశాంత్ సవాల్!

'దమ్ముంటే బాక్సింగ్ రింగ్‌లోకి రా'.. భజ్జీకి శ్రీశాంత్ సవాల్!

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఉదంతం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 18 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య జరిగిన ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.

2008 ఐపీఎల్ సీజన్ సందర్భంగా జరిగిన ఈ ఘర్షణను గుర్తుచేసేలా హర్భజన్ సింగ్ ఇటీవల ఒక వాణిజ్య ప్రకటన షూట్ చేయడమే ఇందుకు కారణమైంది. పాత గాయాలు మర్పిపోయారని భావిస్తున్న తరుణంలో భజ్జీ చేసిన ఈ యాడ్ శ్రీశాంత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీశాంత్‌కు.. గతంలో వారిద్దరూ బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి దిగిన ఒక పాత ఫోటోను యాంకర్ చూపించారు. దానిపై శ్రీశాంత్ స్పందిస్తూ హర్భజన్‌కు బహిరంగంగా సవాల్ విసిరాడు. యాక్టింగ్‌లు, కమర్షియల్ యాడ్స్ ఆపి, ధైర్యముంటే తనతో బాక్సింగ్ రింగ్‌లో పోటీ పడాలని భజ్జీకి సవాల్ చేశాడు.

'భజ్జీ.. నేను మీకు సవాలు విసురుతున్నాను. నీకు అంతగా సమస్య ఉంటే, కేవలం యాడ్స్ చేసి డబ్బులు సంపాదించడం కాదు. నిజాయతీగా నాతో బాక్సింగ్ రింగ్‌లోకి రా. సంతకం చేసి బరిలోకి దిగే దమ్ము నీకు ఉందా? . నేను బేర్ నకిల్ ఫైట్ లీగ్‌లో భాగస్వామిని. మలయాళీలు, సర్దార్ల ఆత్మగౌరవం కోసం ఈ సవాల్‌ను స్వీకరించు. నేను రింగ్‌లో నీ కోసం వేచి చూస్తుంటా' అంటూ శ్రీశాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు మైదానంలో చెంపదెబ్బతో సంచలనం సృష్టించిన వీరి వివాదం.. ఇప్పుడు బాక్సింగ్ రింగ్ సవాల్ వరకు వెళ్లడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

ఖతార్, కెనడా ఆటగాళ్ల మధ్య ఘర్షణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy