Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దరణి పోర్టల్‌' కు ఏడాది పూర్తి

'దరణి పోర్టల్‌' కు ఏడాది పూర్తి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'దరణిపోర్టల్‌'కు ఏడాది నిండింది. దేశంలోనూ విన్నూతంగా ప్రారంభించిన ఈ పోర్టల్‌ గత సంవత్సరం అక్టోబరు, 29న ముఖ్యమంత్రిచేతుల మీదుగా ప్రారంభించారు.

వినూత్నమైన ఈ ప్రాజెక్టును భూములకు రక్షణ కల్పించడం, ఎవరూ టాంపర్‌చేయకుండా పటిష్టంగా రూపొందింది. అలాగే సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా రెవెన్యూ అఽధికారులకు చాలా సులభంగా భూముల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపర్చే అవకాశం ఏర్పడింది. వ్యవసాయం, ఇతర సంబంధిత భూములకు సంబంధించిన లావాదేవీలకు ధరణి ఒక పరిష్కారంగా అమలులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఽ

దరణిలో వల్ల భూముల రిజిస్ర్టేషన్‌లోనూ ప్రజలకు ఇంటివద్దకే వచ్చిసేవలు అందించేలా తీర్చిదిద్దారు. గతంలో 141 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ర్టేషన్లు జరిగేవి. కానీ ధరణి వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 574 తాసిల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మొత్తానికి భూ పరిపాలనలో ధరణి ఒక బెంచ్‌మార్క్‌గా రూపొందిందని అధికారులు తెలిపారు. గత సంవత్సర కాలంలో ధరణి పోర్టల్‌ ద్వారా 5.17 కోట్ల విలువగా గల 10 లక్షల లావాదేవీలు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ధరణి ద్వారా 1,80,000 ఎకరాల భూములకు సంబంధించి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు జారీ చేశారు.

 దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలి: కేసీఆర్‌  Hyderabad: 30 శాతం భూములు నిషేధిత చట్టాల్లో..: కోదండరెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy