Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే  మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): విద్యే అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనతో పాటు సమాజాన్ని జాగృతం చేసే శక్తి విద్యకే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా తానే చేపట్టానని తెలిపారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యకు ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు పెట్టారు.

రెండేళ్ల కృషికి నిదర్శనం..

పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్ర పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 'ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)'లో పేర్కొనడం తమ ప్రభుత్వ రెండేళ్ల కృషికి నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి, విద్యా వికాస పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. అయితే తాజా ఫలితాలతో సంతృప్తి చెందకుండా మరింత మెరుగైన ఫలితాల కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ లక్ష్య సాధనకు కేంద్ర నివేదికలో వచ్చిన తాజా ఫలితాలు మరింత ప్రేరణనిచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy