Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా బీజేపీ విధానాలు: రాఘవులు

దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా బీజేపీ విధానాలు: రాఘవులు

కర్నూలు: దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా బీజేపీ విధానాలున్నాయని సీపీఎం నేత రాఘవులు దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

కనీసం 60 శాతం వ్యాక్సిన్ వేస్తేనే థర్డ్‌వేవ్‌ రాకుండా ఉంటుందన్నారు. 2023 వచ్చినా ప్రజలకు పూర్తిగా వ్యాక్సిన్ అందే పరిస్థితి లేదన్నారు. కరోనా విపత్తుతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు లేకుండా బిల్లులను బీజేపీ ఆమోదించుకుందని విమర్శించారు. ప్రశ్నించేవారిపై ఐటీ, ఈడీలను ఉపయోగించి బెదిరిస్తోందన్నారు. ఈ నెల 27న భారత్ బంద్‌కు టీడీపీ, వైసీపీ మద్దతివ్వాలని బీవీ రాఘవులు కోరారు.

బీజేపీని.. దేశమంతా వ్యతిరేకిస్తోంది: రాఘవులు వైసీపీలో ఆధిపత్య పోరు విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy