Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు

దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు

హైదరాబాద్, జులై 2: దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) పోలీసులు ఛేదించారు.

వైద్య సామగ్రి, మెడిసిన్ రవాణా పేరుతో గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టిస్తున్న ఒక పెద్ద ముఠా ఉనికిని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా జార్ఖండ్ కేంద్రంగా పనిచేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టిన హెచ్-న్యూ పోలీసులు.. జార్ఖండ్‌కు చెందిన ప్రధాన నిందితుడు రాహుల్‌ను అరెస్టు చేశారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మెడిసిన్ బాక్సుల పేరుతో కొరియర్, ఇతర రవాణా మార్గాల ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ముఠా కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడి అరెస్ట్‌తో ఈ అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన మరికొంత మంది కీలక సభ్యుల వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy