Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దేవినేని' సినిమా చూడటానికి దేవినేని కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతి

'దేవినేని' సినిమా చూడటానికి దేవినేని కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతి

బెజవాడ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'దేవినేని'. మార్చి 5న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా విషయంలో దేవినేని నెహ్రూ కుమారుడు, వైసీపీ లీడర్ అవినాష్‌ కామ్ గా ఉన్నా.. ఈ చిత్ర నిర్మాత, దర్శకుడిపై ఫైర్‌ అవుతూ.. దేవినేని ఇంటి పేరు కలిగిన రవీంద్ర అనే అతను కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మా సర్ నేమ్ వాడారని, దీనికి మేం ఒప్పుకోమని, వెంటనే సినిమాని నిలిపివేయాలని తెలుపుతూ.. చిత్ర నిర్మాతలు జిఎస్ఆర్, రాము రాథోడ్‌.. అలాగే దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు)లపై ఆయన కేసు ఫైల్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే 'దేవినేని' సినిమాలో ఎవరినీ కించపరచలేదని, ఎవరి బయోపిక్‌ కాదని, ఊహించి రాసుకున్న కథ అని చిత్రయూనిట్‌, దర్శకుడు నర్రా శివనాగు పలు సందర్భాల్లో తెలియజేశారు.

ఈ కేసును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దేవినేని కుటుంబ సభ్యులకు సినిమా చూడటానికి అనుమతిని ఇచ్చింది. మార్చి 4న దేవినేని కుటుంబ సభ్యులకు 'దేవినేని' సినిమాను మార్చి 4న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్‌ ప్రత్యేకంగా ప్రదర్శించనుంది. సినిమాలో మార్పులు చేర్పులను సూచించకుండా కుటుంబ సభ్యులు సినిమా చూడటానికి మాత్రమే అనుమతినిస్తున్నట్లు హైకోర్టు తెలియజేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy