ఢిల్లీ, మే3 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు (ఆదివారం) అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందగానే ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒక్కసారిగా మంటలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేక్ విహార్‌లోని ఓ భవనంలోని రెండో అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో అమర్చిన ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చి మొత్తం ఇంటిని అలుముకున్నాయి. అక్కడున్న వారు బయటకు రాకముందే మంటలు వేగంగా వ్యాపించాయి.

