Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్ ఎవరు అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే! కపిల్ దేవ్ నుంచి మొదలు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరకు చాలా మంది ప్లేయర్లు జట్టు కోసం ఎన్నో సేవలు చేశారు.

కీలక సిరీస్‌ల్లో ముందుండి ఒంటిచేత్తో గెలిపించారు. అయితే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరో చెప్పేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రహానె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆ పాడ్‌కాస్ట్‌లో అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరని వ్యాఖ్యాత రహానెను ప్రశ్నించాడు. 'ఒక్కరి పేరు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన జాబితాలో చాలా మంది ఉన్నారు. అయితే నా అభిప్రాయం ప్రకారం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్' అని సమాధానమిచ్చాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ పేరిట ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. టెస్టులు, వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా సచిన్ రికార్డు చెక్కుచెదరలేదు. మొత్తం 34,357 అంతర్జాతీయ పరుగులతో క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన సచిన్.. 15,921 పరుగులు, 51 శతకాలు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డేల్లోనూ సచిన్ రికార్డులు ప్రత్యేకమే. 1998లో ఒకే క్యాలెండర్ ఏడాదిలో 1,894 పరుగులు, 9 సెంచరీలు సాధించాడు. ఇప్పటికీ ఇవే అత్యధికంగా ఉన్నాయి. వన్డేల్లో 18 వేల పరుగుల మైలురాయిని కేవలం 440 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 145 అర్ధ సెంచరీలు, 2,016 ఫోర్లు కూడా సచిన్ ఖాతాలో ఉన్నాయి. 22 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ క్రికెట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశాడు. అందుకే అభిమానులు ఆయనను 'క్రికెట్ దేవుడు'గా పిలుచుకుంటారు.

strong>

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy