Friday, 23 Apr, 2.21 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
దీదీకి అమిత్‌షా 'ఎమోషనల్ కౌంటర్'

కోల్‌కతా : బీజేపీని అవుటర్స్ అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న సీఎం మమతా బెనర్జీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం మమత అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని, వారే అవుట్ సైడర్స్ అని అమిత్‌షా ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనపై, ప్రధాని మోదీపై లేనిపోని అభాండాలు వేయడమే సీఎం మమత పని అని, అంతకు మించిన అజెండా ఆమె వద్ద లేదని దెప్పొపొడిచారు. ప్రతి ఎన్నికల ర్యాలీలో ఓ పది నిమిషాలు మమ్మల్ని విమర్శించడానికే సమయం కేటాయిస్తారని విమర్శించారు. తాను దేశానికి హోంమంత్రినని, దేశ ప్రజలతో మాట్లాడే హక్కు లేదా అని నిలదీశారు. తానెలా అవుట్ సైడర్‌ను అవుతానో చెప్పాలని షా డిమాండ్ చేశారు. ''నేను ఈ దేశంలోనే పుట్టాను. నేను మరణించిన తర్వాత ఈ పవిత్ర భూమిలోనే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ మీ ఓటు బ్యాంకుగా ఉన్న అక్రమ వలసదారులే అవుట్ సైడర్స్. వీరే వామపక్షాలకు, కాంగ్రెస్‌కు కూడా ఓటు బ్యాంకుగా ఉంటున్నారు'' అని అమిత్‌షా విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top