
నారాయణపేట: దిశ సంఘటనలో నిందితులైన నలుగురు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా అందులో ఒకరైన జొల్లు నవీన్‌కు సంబందించిన ద్విచక్రవాహనాన్ని శనివారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకవెళ్లారు. దిశ సంఘటన జరిగిన వేకువజాముననే జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి బైక్‌పై వచ్చిన జొల్లు నవీన్‌ను అదేరోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి ముందు ఉన్న బైక్‌ను తరలించి మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. తాజాగా మక్తల్‌లో ఉంచిన బైక్‌ను షాద్‌నగర్ పోలీసులు తమ పీఎస్‌కు తరలించారు.