జాతీయం-అంతర్జాతీయం
ద్రవ్యోల్బణంలోనూ పన్నులు పిండుకుంటున్నారు: రాహుల్

న్యూఢిల్లీ: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. ద్రవ్యోల్బణాన్ని కూడా ఖాతరు చేయకుండా పన్నుల వసూళ్లలో ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు. జీడీపీలో అద్భుతమైన వృద్ధి సాధించారంటూ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'జీడీపీ (గ్యాస్-డీజిల్-పెట్రోల్ ధరలు) విషయంలో మోదీ అద్భుతమైన ప్రగతిని సాధించారు. జనం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లలో తలమునకలవుతోంది' అని రాహుల్ ఆదివారంనాడు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా చమురు ఉత్పత్తి దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడమే ఇంధనం ధరల పెరుగుదలకు కారణమని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ చెబుతోంది.
దేశ అవసరాలకు తగినట్టుగా 80 శాతం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, కరోనా కారణంగా చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని నిలిపివేయడం, తగ్గించడం చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారంలో తెలిపారు. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమని ఆయన చెప్పారు.
related stories
-
హోమ్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి
-
జాతీయ వార్తలు రవాణా చార్జీలు 25 శాతం పెరగవచ్చు
-
ప్రధాన వార్తలు సామాన్యుడిపై మరో పిడుగు