(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌గాతెలుగు వ్యక్తి డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
కాన్సుల్ జనరల్‌గా తెలుగు వ్యక్తి రావడంతో దుబా యి, ఇతర ఎమిరేట్‌లలోని తెలుగు ప్రవాసీలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు రసమయి అధ్యక్షుడు యస్వి రెడ్డి ఆధ్వర్యంలో కొందరు తెలుగు ప్రముఖులు విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు. దుబాయి, ఉత్తర ఎమిరేట్‌లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సగటు కార్మికుల జీవన స్థితిగతులను వారు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
>
ఫెర్టిలైజర్ యాప్‌ను తేనున్న కేంద్రం.. ఒకే యాప్ ద్వారా అన్ని ఎరువులు..

