Sunday, 28 Feb, 2.08 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
దుబ్బాక దెబ్బ నుంచి టీఆర్‌ఎస్‌ కోలుకోలేదు

కుటుంబ పార్టీలతో దేశానికి లాభం లేదు : ప్రకాశ్‌ జావడేకర్‌

కవాడిగూడ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): 'ఆత్మనిర్భర్‌ భారత్‌'తో దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. పేదలను వృద్ధిలోకి తీసుకురావడమే బీజేపీ లక్ష్యమన్నారు. పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని హోటల్‌ మారియెట్‌లో 'ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో పట్టభద్రుల పాత్ర' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రకాశ్‌ జావడేకర్‌ హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ లాంటి కుటుంబ పార్టీలతో దేశానికి లాభం లేదన్నారు. దుబ్బాకలో బీజేపీ కొట్టిన దెబ్బకు.. టీఆర్‌ఎస్‌ ఇంకా కోలుకోలేదని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావును చూసి టీఆర్‌ఎస్‌ నాయకులు భయపడుతున్నారని, అందుకే వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు మండలిలో చేసిన ప్రసంగాల పుస్తకాన్ని ఈసందర్భంగా కేంద్రమంత్రి ఆవిష్కరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top