Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏ బౌలర్‌కి భయపడతావు?.. వైభవ్ సింగిల్ లైన్ ఆన్సర్ వైరల్!

ఏ బౌలర్‌కి భయపడతావు?.. వైభవ్ సింగిల్ లైన్ ఆన్సర్ వైరల్!

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించాడు.

ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ 2025లో తన అద్భుతమైన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. అలానే ఐపీఎల్ 2026 సీజన్‌లో మరింత మెరుగ్గా రాణించి, ఈ ఎడిషన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సూర్యవంశీ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లను అధిగమించి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.

వైభవ్ ఐపీఎల్‌లో అంతర్జాతీయ స్టార్ బౌలర్లను కూడా అలవోకగా చితకబాదాడు. జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ వంటి వారిని అతను చిత్తు చేసిన తీరు సూర్యవంశీ ప్రతిభకు ఉదాహరణ. ఈ క్రమంలో అసలు వైభవ్ ఏ బౌలర్ కి భయపడతాడు?, ఏ బౌలర్ కైనా భయపడతాడా? అనే సందేహాలు చాలా మంది క్రికెట్ అభిమానుల్లో ఉన్నాయి. అలాంటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం దొరికే ఓ వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంది.

ఆ వీడియోలో.. ఏ బౌలర్‌నైనా ఎదుర్కోవాలంటే భయమా అని యాంకర్ అడిగినప్పుడు సూర్యవంశీ అదిరిపోయే మాస్ రిప్లయ్ ఇచ్చాడు. తాను భయపడే బౌలర్ ఇప్పటివరకు ఎవరూ లేరని బదులిచ్చాడు. ఈ చిన్న సమాధానం సూర్యవంశీకి తనపై ఉన్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వచ్చే నెలలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టుకు సూర్యవంశి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అంతేకాక ఆ జట్టుకు బీహార్ నుంచి ఎంపికైన ఏకైక ఆటగాడు సూర్యవంశీ కావడం గమన్హారం.

strong>

యువ పేసర్లకే సెలెక్టర్ల మొగ్గు.. షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా?

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌బై

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy