ఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసానికి ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈరోజు (మంగళవారం) మార్చ్ చేపట్టారు.
వందమందితో ప్రధాని నివాసానికి మార్చ్ చేపట్టినట్లు ప్రకటించారు. E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షలకు పైగా సంతకాలను సమర్పించేందుకు ప్రధాని నివాసానికి పాదయాత్రగా వెళ్తున్నట్లు మాజీ సీఎం తెలిపారు. ఇథనాల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుందని, పాడవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్టును వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
అందుకే ఇథనాల్ తెచ్చారు: కేజ్రీవాల్
ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి, ఆయన కొడుకులకు మేలు చేసేందుకే ఇథనాల్ తీసుకువచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుడికి ఆప్షన్ ఉండాలని పట్టుబట్టారు. ప్యూర్ పెట్రోల్ కంటే, E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని పేర్కొన్నారు. పెట్రోల్ ధరను రూ.84కు చేర్చాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
వార్తలు కూడా చదవండి...

