Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు

ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు

ఢిల్లీ, జూన్11, (ఆంధ్రజ్యోతి): ఏపీలో కొత్త పాపులేషన్‌ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు.

విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీస్‌, అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ తీసుకువస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు (గురువారం) జరుగుతున్ననీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 'వికసిత్ భారత్ @2047' లక్ష్యానికి అనుగుణంగా 'స్వర్ణాంధ్ర @2047' ప్రతిష్ఠాత్మక విజన్ ప్లాన్‌ను సమర్పించారు. పేదరిక నిర్మూళన, భారీస్థాయిలో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలుగా స్వర్ణాంధ్ర రోడ్‌మ్యాప్ ప్రకటించారు. గడిచిన రెండేళ్లలో ఏపీ పారదర్శక విధానాల వల్ల రూ. 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులని ఆకర్షించామని వెల్లడించారు.

రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీ వద్దు..

ఆర్టీజీఎస్ (RTGS), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 'అవేర్' (AWARE) వంటి ప్రిడిక్టివ్ టూల్స్‌తో ఏపీలో సాంకేతిక పాలన కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీ వద్దని సూచించారు. మౌలిక వసతులు, స్థిరమైన విధానాలపై దృష్టి పెట్టాలని ఆయా రాష్ట్రాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబానికి ఇళ్లు, తాగునీరు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ సహా 7 ప్రాథమిక అవసరాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.

'ప్రాజెక్ట్ సంజీవని' అమలు..

సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10శాతం మంది.. వెనుకబడిన 20శాతం మందిని ఆదుకునేలా వినూత్న 'P4-MBK 10-20' కార్యక్రమం తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో నివారణ ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ రికార్డుల కోసం 'ప్రాజెక్ట్ సంజీవని' అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేసేలా ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్‌డ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తున్నట్లు వివరించారు.

సంతానోత్పత్తి రేటు తగ్గడంపై ఆందోళన..

ఏపీలో సంతానోత్పత్తి రేటు (Fertility Rate) 1.5శాతం కంటే తగ్గడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మానవ వనరుల కొరత, వృద్ధాప్య సమస్యలను అధిగమించేందుకు ఏపీలో కొత్త 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ' తీసుకువస్తామని వివరించారు. వికసిత్ భారత్ 2047 సాధన కోసం కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

.

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy