మహబూబాబాద్: జిల్లాలోని గుండంరాజుపల్లి పెద్ద చెరువుకు అధికారులు మరమ్మతులు చేశారు. గత రాత్రి చెరువుకు బుంగ పడిన విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో చెరువు కట్టకు పడిన బుంగలను అధికారులు పూడ్చివేశారు. బుంగలు పడిన ప్రదేశంలో తాత్కాలికంగా కట్టను ఏర్పాటు చేశారు. గ్రామానికి ముప్పు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామానికి ముప్పు తప్పడంతో గ్రామస్తులు, స్థానిక నేతలు ఏబీఎన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
