Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏబీసీ చైర్మన్‌గా మోహిత్‌ జైన్‌

ఏబీసీ చైర్మన్‌గా మోహిత్‌ జైన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్‌ జైన్‌ ఎన్నికయ్యారు. బెన్నెట్‌ కోల్మన్‌ అండ్‌ కో లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (పబ్లిషింగ్‌), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్‌ జైన్‌ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్‌కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్‌ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్‌ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్‌ జైన్‌.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ చదివిన జైన్‌.. 2021-22లో ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్‌ఎ్‌సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ గ్లోబల్‌ సూపర్‌వైజరీ బోర్డులోనూ మోహిత్‌ జైన్‌ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ న్యూస్‌ మీడియా అసోసియేషన్‌ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా విక్రమ్‌ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy