Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా, ఆగస్టు 31: జిల్లాలోని హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన కొనసాగుతోంది. ఉమ్మాపూర్‌లో రూ.7.28 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టు లోపు ఇంజినీరింగ్ కళాశాలను పూర్తి చేసి జాతీయ జెండా ఎగరవేస్తామని చెప్పారు.

తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పూర్తవుతుందని మంత్రి తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ కళాశాలకు త్వరలో మరో రెండు బస్సులను తీసుకొస్తామని వెల్లడించారు. విద్యా ప్రమాణాలు బాగుంటేనే విద్యాసంస్థలు అభివృద్ధి చెందుతాయన్నారు. త్వరలో హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీని తీసుకొస్తామన్నారు. సౌకర్యాలు మావి ర్యాంకులు తెచ్చే బాధ్యత మీది అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy