Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ 2 విషయాల్లో క్షమాపణ చెప్పినా తప్పులేదు

ఈ 2 విషయాల్లో క్షమాపణ చెప్పినా తప్పులేదు

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం వెనక్కి తగ్గాలా? లేక మన నిర్ణయంపై గట్టిగా నిలబడాలా? అనే సందేహం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న తప్పులు కూడా బంధాలను దెబ్బతీయవచ్చు.

అలాగే, అనవసరమైన వాదనలు మన సమయాన్ని, మనశ్శాంతిని దూరం చేస్తాయి. అందుకే తప్పు చేసినప్పుడు అహంకారాన్ని పక్కనపెట్టి దాన్ని అంగీకరించాలని చాణక్య నీతి సూచిస్తుంది. అదే సమయంలో మనకు గౌరవం లేని చోట పదేపదే గొడవపడటం కంటే.. ప్రశాంతంగా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడం కూడా తెలివైన నిర్ణయమేనని చెబుతుంది.

తప్పు జరిగితే వెంటనే క్షమాపణ చెప్పండి

మన తప్పును అంగీకరించడం వల్ల మన గౌరవం తగ్గదు. మన మాటలు లేదా పనుల వల్ల ఎవరైనా బాధపడితే.. ఆ విషయాన్ని గుర్తించి క్షమాపణ చెప్పడం మంచిది. కొందరు అహంకారం కారణంగా తప్పని తెలిసినా మౌనంగా ఉంటారు. క్షమాపణ చెబితే తమ గౌరవం తగ్గిపోతుందని భావిస్తారు. కానీ ఇలాంటి వైఖరి బంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

ఉదాహరణకు.. కోపంలో మనకు దగ్గరైన వ్యక్తిని బాధించేలా మాట్లాడితే, తప్పు తెలుసుకున్న వెంటనే క్షమాపణ చెప్పడం మంచిది. తప్పని తెలిసినా మొండిగా వ్యవహరిస్తే.. అపార్థాలు పెరిగి బంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

సర్దుకుపోవడం తప్పు కాదు

ప్రతి వాదనలో మనమే గెలవాలని పట్టుబట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాదనలో గెలవడం కంటే బంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. గతంలో జరిగిన చిన్న అపార్థం కారణంగా కుటుంబ సభ్యుడు లేదా సన్నిహిత స్నేహితుడు మనకు దూరమవుతున్నట్లయితే.. సమస్యను పరిష్కరించేందుకు మనమే ముందడుగు వేయవచ్చు.

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. బంధాన్ని కాపాడుకోవడానికి కొంత సర్దుకుపోవడం వేరు.. పదేపదే అవమానాలను భరించడం వేరు. ఇద్దరూ బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటే.. కొంత వెనక్కి తగ్గి, ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం మంచిదని చాణక్యుడు సూచిస్తున్నారు.


Also Read:

బరువు తగ్గడం, కండరాల పెరుగుదల.. గుడ్లు ఇలా తింటే బెటర్!

మిక్స్‌డ్ ఫ్రూట్స్ తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy