హిందూపురం టౌన, జూలై 28: కోడికి ఏంటి నాలుగు కాళ్లు అనుకుంటున్నారా? అవును నాలుగు కాళ్ల కోడి హిందూపురంలో వెలుగులోకి వచ్చింది. గౌరిబిదునూరు కోళ్ల ఫారం నుంచి హిందూపురం చికెన సెంటర్ వారు దిగుమతి చేసుకుంటుంటారు. అయితే బుధవారం పట్టణంలోని రిలయన్స పెట్రోల్ బంక్ సమీపంలో ఓ చికెన సెంటర్ లో నాలుగు కాళ్లు ఉన్న కోడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాలుగు కాళ్ల కోడిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.

