Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

త కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి (Gold and Silver Rates).

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,800గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,210గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,950గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి (Silver prices today). ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,95,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,95,000గా, బెంగళూరులో రూ.2,85,000గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..

టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy