కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 'సి. సి. సి. మనకోసం' (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ 'సి. సి. సి. మనకోసం' సంబంధించిన వివరాలను గురించి దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ''కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వేలాది మంది కార్మికులకు అండగా నిలబడాలనే సంకల్పంతో చిరంజీవిగారి ఆధ్వర్యంలో సి.

