జాతీయం-అంతర్జాతీయం
ఈడీ కేసు కొట్టివేయాలంటూ బోంబే కోర్టుకు ఖడ్సే

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత ఏకనాథ్ ఖడ్సే ఇవాళ బోంబే కోర్టును ఆశ్రయించారు. తనపై ఈడీ దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను కొట్టివేయాలని ఆయన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అక్రమ లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లోని పలు సెక్షన్లను ఉపయోగించి ఈడీ ఈ కేసు నమోదు చేసింది. కాగా దీనిపై ఖడ్సే పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. దీంతో తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఈడీ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కోర్టుకు తెలిపారు. కాగా పుణేలో ఓ భూమి కొనుగోలు ఒప్పందానికి సంబంధించి విచారణకు ముంబై రావాలంటూ ఈడీ సమన్లు ఇటీవల ఖడ్సేకి సమన్లు జారీ చేసింది. 2016కి సంబంధించిన ఈ కేసులో 15న ఖడ్సే ఈడీ ముందు హాజరయ్యారు. వాస్తవానికి డిసెంబర్‌లోనే ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసిన్పటికీ ఆరోగ్య కారణాలు చూపిస్తూ ఆయన విచారణకు వెళ్లలేదు.