Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఈనెల 7న 'తోడు-నీడ' వివాహ పరిచయ వేదిక

హైదరాబాద్/పంజాగుట్ట : మలి వయస్సులో తోడు లేక ఒంటరిగా జీవిస్తున్న వారి కోసం 'తోడు-నీడ' స్వచ్ఛంద సంస్థ వివాహ పరిచయ వేదిక నిర్వహి స్తోందని సంస్థ అధ్యక్షురాలు ఎన్‌ఎం.రాజేశ్వరి తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంస్థ న్యాయ సలహాదారు రాధాదేవితో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు. 50 ఏళ్ల పై బడిన భార్య, భర్త చనిపోయిన వారు, విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నవారు, పిల్లలు దూరంగా ఉన్న వారు ఇందులో పాల్గొనవచ్చునన్నారు. పరిచయ కార్యక్రమానికి వచ్చే వారు రెండు పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆధార్‌ జిరాక్స్‌, మరణ ధ్రువీకరణ, విడాకుల మంజూరు పత్రాలను వెంట తీసుకుని రావాలని సూచించారు. ఈ నెల 7న తార్నాక చౌరస్తాలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ పక్క వీధిలోని సత్యోదయం హాల్‌లో వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy