పురుషుల హాకీ వరల్డ్‌కప్ 3 రోజుల్లో
మారిన ఫార్మాట్
క్వార్టర్స్ లేకుండా మూడంచెల విధానం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్‌కప్ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది.
51 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించడానికి భారత పురుషుల జట్టు కూడా సన్నద్ధమవుతోంది. అయితే, నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ ఫార్మాట్‌లో చెప్పుకోదగ్గ మార్పులు చేయడం విశేషం. గత టోర్నీకి భిన్నంగా సంప్రదాయంగా నిర్వహించే క్వార్టర్ ఫైనల్స్‌ను కొత్త ఫార్మాట్‌లో తొలగించారు. 16 జట్లు పాల్గొంటున్న టోర్నీలో నాలుగేసి జట్లను నాలుగు గ్రూపులు ఎ, బి, సి, డిలుగా వర్గీకరించారు. గ్రూప్-డిలో భారత్‌తోపాటు ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్ జట్లున్నాయి. గతంలోలా క్వార్టర్స్ నాకౌట్ మ్యాచ్‌లు లేవు. బదులుగా టోర్నీని మూడు స్థాయిల్లో నిర్వహిస్తారు. టోర్నీ ఈనెల 15 నుంచి 30వరకు జరుగుతుంది.
ఫార్మాట్ ఇలా..
గ్రూప్ దశ
తొలి అంచె: ఈనెల 15 నుంచి 20 వరకు
టోర్నీలో పాల్గొనే 16 జట్లను.. నాలుగేసి చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు.. తర్వాతి క్రాస్ ఓవర్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
రెండో దశ
క్రాస్ ఓవర్ రౌండ్: ఈనెల 21 నుంచి 24 వరకు
తొలి దశలో లభించిన పాయింట్ల ఆధారంగా.. ఈ రౌండ్‌లో ఆయా జట్లను ఈ, ఎఫ్, జీ, హెచ్ గ్రూప్‌లుగా వర్గీకరిస్తారు.
పూల్-ఈ: గ్రూప్-ఎ, గ్రూప్-డిల్లో టాప్-2లో నిలిచిన జట్లు.. మొత్తంగా నాలుగు టీమ్‌లు.
పూల్-ఎఫ్: గ్రూప్-బి, గ్రూప్-సిలో టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు.
పూల్-జి: గ్రూప్-ఎ, గ్రూప్-డి నుంచి 3, 4 స్థానాల్లోని జట్లు.
పూల్-హెచ్: గ్రూప్-బి, గ్రూప్-సి నుంచి 3,4 స్థానాల్లోని జట్లు.
ఇందులో ప్రతి టీమ్.. తొలి దశలో ఎదుర్కొనని ప్రత్యర్థులతో మూడేసి మ్యాచ్‌లు ఆడనుంది. అంతేకాకుండా లీగ్ దశలో ముందంజ వేసిన రెండో జట్టుపై ఫలితం ద్వారా లభించిన పాయింట్లు కూడా ఇక్కడ కలవనున్నాయి. అంటే, గ్రూప్ దశలో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచి, ఆ రెండు జట్లూ రెండో రౌండ్‌కు చేరితే.. ఆ పాయింట్లను మనోళ్లు తర్వాతి దశలో కూడా క్యారీ చేస్తారు. ఒకరకంగా ఇది ఆ జట్టుకు అదనపు ప్రయోజనంగా మారుతుంది.
మూడో దశ
క్లాసిఫికేషన్, సెమీస్ మ్యాచ్‌లు: ఈనెల 27-28
పూల్-ఈ, పూల్-ఎఫ్‌లో టాప్-2లో నిలిచిన రెండేసి జట్లు సెమీ్‌సకు అర్హత సాధిస్తాయి. కాగా, మిగతావి 5 నుంచి 16 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లు ఆడతాయి.
సెమీస్ ఇలా..:
పూల్-ఈ అగ్రస్థానం గీపూల్-ఎఫ్ రెండోస్థానం; పూల్-ఎఫ్ అగ్రస్థానం గీపూల్-ఈ రెండోస్థానం
ఫైనల్: ఆగస్టు 30
సెమీ్‌సలో గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం పోరాడతాయి. దానికి ముందు కాంస్య పతక పోరు జరుగుతుంది.
/span>
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..

