Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎక్స్‌ప్రెస్‌ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎక్స్‌ప్రెస్‌ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం

  • అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు

  • అక్క చెల్లెళ్లయిన ఇద్దరు టెకీల దుర్మరణం

  • ఒకరికి తీవ్రగాయాలు

రామకుప్పం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వి.కోట మండల పరిధిలోని బెంగళూరు- చైన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేలో మంగళవారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ రోడ్డు ప్రమాదంలో బెంగళూరులో సాఫ్ట్‌వేరు ఇంజనీర్లుగా పనిచేస్తున్న అక్కాచెల్లెళ్ళు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వి.కోట ఎస్‌ఐ షేక్షావలి తెలిపిన ప్రకారం.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లె పంచాయతీ బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన అనిల్‌ కుమార్‌రెడ్డి, ఆయన భార్య మానస(35), మరదలు, గౌతమి(32).. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. వీరు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. వచ్చే దారిలో బట్టరహళ్లి జంక్షన్‌ వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్ర వీరిని లిఫ్ట్‌ అడిగి.. కారులో ఎక్కారు. డ్రైవింగ్‌ చేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డి పక్కన పరంధామరెడ్డి.. వెనుక సీట్లో మానస, గౌతమి, జ్ఞానేంద్ర కూర్చున్నారు. వీరి కారు బెంగళూరు-చైన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేలో వి.కోట మండలం రామాపురం సమీపానికి చేరుకోగానే.. అక్కడ అదపుతప్పి ఐదు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమై గౌతమి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన మానసను పలమనేరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతి చెందారు. కారు నడుపుతున్న అనిల్‌కుమార్‌రెడ్డి తల, చేతికి తీవ్రగాయాలవడంతో, కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరంధామరెడ్డి, జ్ఞానేంద్ర సురక్షితంగా ఉన్నారు.

ఇది రెండో ప్రమాదం

బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేలో నెలన్నర కిందట వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల పరిధిలో ఇది రెండో ప్రమాదం. అత్యంత వేగంగా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. గతనెల 25న బెంగళూరు నుంచి వస్తున్న కారు కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లా సోమల మండలానికి చెందిన సాఫ్ట్‌వేరు ఇంజనీర్‌ సత్యశ్రీ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భవ్యకు తీవ్రగాయాలయ్యాయి. తాజాగా మంగళవారం జరిగిన ప్రమ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు దుర్మరణం చెందారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy