Wednesday, 11 Apr, 2.11 am

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
ఎలక్ట్రిక్‌ వాహనాలు అదుర్స్‌

గుంటూరు, ఆంధ్రజ్యోతి: ఆనంద నగరాల శిఖరాగ్ర సదస్సులో మహీంద్రా, గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌, ఎవేరా న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ మోటో కార్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.

ఎలక్ట్రిక్‌ బస్సు...

ఖరీదు రూ.3కోట్లు. దీనిని 4 గంటలు చార్జింగ్‌ చేయాలి. 300 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 31మందికి సీటింగ్‌ సౌకర్యం ఉంది. వికలాంగుల కోసం వీల్‌చైర్‌ సౌకర్యాన్ని కల్పించారు. ఎలాంటి గేర్లూ లేకుండానే రాకపోకలు సాగించే ఈ బస్సు.. గంటకు సుమారు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

ఎలక్ర్టిక్‌ కారు...

మహీంద్ర కంపెనీ ఈ-వెరైటీ పేరుతో ఎలక్ర్టిక్‌ కార్లను ఉత్పత్తి చేసింది. దీని ఖరీదు రూ.12.5 లక్షలు. 8:30 గంటలపాటు బ్యాటరీ చార్జింగ్‌ చేయాలి. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ కారు ప్రయాణించగలదు.

ఎలక్ర్టిక్‌ బైకులు ఎవేరా సంస్థ బేసిక్‌, అడ్వాన్స్‌ మోడల్స్‌ ఎలక్ట్రిక్‌ బైకులను కృష్ణాజిల్లా నున్నలోని ఉత్పాదక కర్మాగారంలో తయారు చేసి ప్రదర్శించింది. లథియంతో బ్యాటరీలను ఉత్పత్తి చేసి బైకులకు అమర్చింది. 4-6గంటల పాటు చార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే... అడ్వాన్స్‌ ఫీచర్లతో రూపొందించిన బైక్‌ అయితే ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 నుంచి 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వీటి గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్లు.

Dailyhunt
Top