Dailyhunt

ఎల్బీనగర్ దియా ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో గల దియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఈ నెల 1న శ్రీరాములు(37) అనే వ్యక్తిని ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో శ్రీరాములు బంధువులు ఆస్పత్రి సిబ్బందికి రూ.6లక్షలు కట్టారు. కాగా ఇన్ని రోజులు చికిత్స అనంతరం శ్రీరాములు చనిపోయాడని...ప్రస్తుతం రూ.14 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెబుతున్నారని మృతుని బంధువులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే శ్రీరాములు చనిపోయాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy