Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏం జరిగినా మాస్క్ ధరించను : రాజ్ థాకరే

ఏం జరిగినా మాస్క్ ధరించను : రాజ్ థాకరే

ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో విధిగా అందరూ మాస్కులు ధరించాలని సీఎం ఉద్ధవ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. శివాజీ పార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే మాస్క్ లేకుండానే హాజరయ్యారు. మాస్క్ విషయమై ప్రశ్నించగా... ''ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాస్క్ ధరించను.'' అని స్పష్టం చేశారు. నిజంగా కరోనా పెరిగితే ఆయా ఐదు రాష్ట్రాల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలని రాజ్ థాకరే ఎదురు ప్రశ్నించారు. అయితే ఆయన భార్య, కుమారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వారు మాత్రం మాస్కులతో కనిపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy