Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి ఎర్రబెల్లి

ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రాడ్యుయేట్ ఓటర్లు, ప్రైవేట్ టీచర్లకు పిలుపునిచ్చారు. వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్ లోని ఆభిరాం గార్డెన్ లో వరంగల్ అర్బన్ జిల్లా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, గ్రాడ్యుయేట్ లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భఃగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన అభివృధ్ధి పనులను ఏకరువు పెట్టారు. కరోనా వైపరీత్యంలోనూ ఒకవైపు అభివృద్ధి, సంక్షేమాలను నిలపకుండా కొనసాగిస్తున్న సీఎం కెసిఆర్ గొప్ప నాయకుడని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం ఉండటం, మన అదృష్టమని మంత్రి తెలిపారు. వందలాది వినూత్న, విశేషమైన పథకాలను ప్రవేశ పెట్టిన ఘతన మన సీఎం కెసిఆర్ దేనని అనారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు.

కరోనా నివారణతోపాటు, వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కెసిఆర్ ది అయితే, అనేక వైఫల్యాలతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. వరంగల్ మహానగర అభివృద్ధి విషయంలోనూ రాజీలేకుండా పని చేస్తున్నామన్నారు. వచ్చే ఉగాది నుంచి వరంగల్ మహానగరానికి ప్రతి రోజూ నల్లాల ద్వారా మిషన్ భగీరథ మంచినీటిని ఇంటింటికీ నల్లాల ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సౌమ్యుడు, విద్యాధికుడు, మంచి వాక్పటిమ ఉన్న నేత, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి కొట్లాడగలడు. సీఎం కెసిఆర్ గారికి అత్యంత ఆప్తుడు. ఇలాంటి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఉద్యమ నేతగా, సీఎం గా కెసిఆర్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి అలుపెరుగకుండా పని చేస్తున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసం పరితపించిన విధంగానే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎం కెసిఆర్ పరిపాలన సాగిస్తున్న విషయాన్నిగుర్తు చేశారు. ప్రాజెక్టులతో నీటిని తెచ్చుకున్నామని, సాగునీరు, మంచినీరు కొరత లేకుండా చేసుకున్నామన్నారు. ఇక మన నిధులు మనమే ఉపయోగించుకుంటుండగా, ఉద్యోగాల కల్పనలోనూ ముందున్నామన్నారు. ఎక్కడా ఎవరి పట్లా నిర్లక్ష్యం చేయలేదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy