Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్

ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్

ఇంటర్నెట్ డెస్క్: కళ్లకురిచ్చి కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణలు రావడం ప్రస్తుతం తమిళనాడులో కలకలం రేపుతోంది.

ఈ విషయమై తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇవి పనిప్రదేశంలో వేధింపులు కావా? అని జస్టిస్ విక్టోరియా గౌరీ ప్రశ్నించారు.

ఈ విషయమై కలెక్టర్ భర్త ఫిర్యాదు చేశారని జస్టిస్ విక్టోరియా గౌరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌పై డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఇప్పటికే వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణలపై తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ స్పందించారు. అవన్నీ నిరాధారణ ఆరోపణలంటూ తోసిపుచ్చారు.

ఈ వివాదంపై ఎంపీ కనిమొళి తొలిసారిగా స్పందించారు. ఎమ్మెల్యే అసభ్యకర మెసేజీలు పెట్టినట్టు, మద్యం మత్తులో కలెక్టర్ ఇంటికి వెళ్లి వేధించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ మాత్రం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. డీఎంకే నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలు ఉన్న కలెక్టర్ బంగళాలోకి తాను ఎలా వెళ్లగలనని ప్రశ్నించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల్లో ఓటమి.. వీధి దీపాలను తొలగించిన ఎమ్మెల్యే అనుచరుడు..?

సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy