Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఘటనలో ముస్లిం ఉగ్రవాదుల హస్తం : హోంమంత్రి

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఘటనలో ముస్లిం ఉగ్రవాదుల హస్తం : హోంమంత్రి

బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై జరిగిన దాడి విషయంలో రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడి వెనుక ముస్లిం ఉగ్రవాదుల పాత్ర ఉందని హోం మంత్రి గురువారం ప్రకటించారు.

''ఎమ్మెల్యేకు, అనుచరులకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. అలాగే ఎమ్మెల్యేకూ, సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు తీవ్రమైన భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ ఘటన పెద్ద కుట్రలో భాగమే. సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పాత్ర కూడా పెద్దదే'' అని ప్రకటించారు. ఈ విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నామని, ఎస్‌డీపీఐ పాత్ర కూడా ఉందన్న వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని హోంమంత్రి బసవరాజ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy